
కోదాడ: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల కిట.. కిట
కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, రామాలయం, రఘునాథ స్వామి దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, శివలింగానికి అభిషేకాలు జరిపి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ప్రాధాన్యతను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.







































