రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

6చూసినవారు
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
దామరచర్ల మండల కేంద్రంలో ఆదివారం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని చెన్నబోయిన పెద్ద బిక్షం అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, రాజగట్టు గ్రామానికి చెందిన పెద్ద బిక్షం రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్