మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం చండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. నూటికి నూరు శాతం ఫెయిల్యూర్ అయ్యారని ఆయన ఎద్దేవ చేశారు.