నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

108చూసినవారు
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి 165 పై శనివారం మధ్యాహ్నం అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొని, ఎదురుగా వస్తున్న మరో కారుపై పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా, దాదాపు 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే మూడు 108 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి.

సంబంధిత పోస్ట్