ఒక్కోసారి పోలీసుల మందుకు వింత కేసులు వస్తాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో కోడి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తన గడ్డివాములో గింజలు తింటుందని, పక్కింటి వ్యక్తి రాకేష్ కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టాడు. దీంతో గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, కేసు నమోదు చేసేదాక వెనక్కి తగ్గేది లేదంటూ మహిళా తేల్చి చెప్పడంతో వారు తలలు పట్టుకుంటున్నారు.