శుక్రవారం సాయంత్రం శాలిగౌరారం మండలం ఉట్కూర్ - చౌళ్లగూడెం మధ్యలో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. శాలిగౌరారం అంబులెన్స్ సిబ్బంది రమేశ్, సమీర్ బాబా ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.