ఉరేసుకుని ఏఓ బాలరాజు ఆత్మహత్య

1చూసినవారు
ఉరేసుకుని ఏఓ బాలరాజు ఆత్మహత్య
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ (ఏఓ)గా పనిచేస్తున్న గుంటోజు బాలరాజు (38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల ఒత్తిడి కారణంగానే ఆయన ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్