నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులోని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. అగ్నిగుండం దాటే క్రమంలో భక్తులు కిందపడటంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అప్రమత్తమై నిప్పుల్లో పడిన భక్తులను బంధుమిత్రుల సహాయంతో బయటకు తీశారు. భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.