నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెంలో వృద్ధ దంపతులు నక్క లక్ష్మి, రామయ్యలపై వారి సొంత గ్రామస్తులైన రామలింగయ్య, శంకరయ్య పొలం గట్టు వద్ద గొడవలో కొడవళ్లతో దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన దంపతులను స్థానికులు సాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.