ఒత్తిడితో ఐకేపీ సెంటర్ ఇన్‌చార్జ్ ఆత్మహత్యాయత్నం

813చూసినవారు
నల్గొండ జిల్లా కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ కొప్పుల సైదులు, మిల్లర్ల వేధింపులు, రైతుల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో, తన మరణంతోనైనా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సైదులు పరిస్థితి విషమంగా ఉండగా, స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్