మిర్యాలగూడకు.. ఆ పేరెలా వచ్చిందంటే...!

5చూసినవారు
మిర్యాలగూడకు.. ఆ పేరెలా వచ్చిందంటే...!
మిర్యాలగూడ తెలంగాణలోని ఒక ప్రధాన పట్టణం, పంట సేకరణ, రైస్ మిల్లులకు ప్రసిద్ధి చెందింది. పూర్వం నిజాం నవాబులు నాణేల మార్పిడికి టంకశాల ఏర్పాటు చేసి, మీర్ ఆలం అనే అధికారిని నియమించారు. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతం మిర్యాలగూడగా మారిందని చెబుతారు. ఆయన నిర్మించిన మసీదు నేటికీ ఉంది. 1941లో 5,628 జనాభాతో మొదలై, 2011 నాటికి 1.09 లక్షలకు, ప్రస్తుతం లక్షన్నరకు పైగా జనాభాతో అభివృద్ధి చెందింది. పట్టణం గుండా రాష్ట్ర, జాతీయ రహదారులు, రైలు మార్గం ఉన్నాయి.

సంబంధిత పోస్ట్