వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.