నల్గొండ: సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం!

4చూసినవారు
నల్గొండ: సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం!
నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన 11 మంది అభ్యర్థులు, గ్రామాభివృద్ధి కోసం రూ.73 లక్షలకు వేలంపాటలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థికి దక్కించుకున్నారు. మిగతా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడానికి అంగీకరిస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్