మహిళల పుస్తెల తాళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన పవన్, అతని సోదరుడు రాజు కొంత కాలంగా చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం అనుమానాస్పదంగా కన్పించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. 8 పుస్తెల తాళ్లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు.