నల్గొండ: కుటుంబ కలహాలు.. వివాహిత ఆత్మహత్య

5చూసినవారు
నల్గొండ: కుటుంబ కలహాలు.. వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై ఒక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం, కన్నూరు గ్రామానికి చెందిన గొల్లెన లక్ష్మి (25) తన భర్తతో గొడవపడి, మామగారి ఇంటికి వచ్చి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్