బాలికపై అత్యాచారం.. 21 ఏళ్ల జైలు శిక్ష

1291చూసినవారు
బాలికపై అత్యాచారం.. 21 ఏళ్ల జైలు శిక్ష
బాలికపై అత్యాచార ఘటనపై నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన జడిగల హరీశ్ అనే యువకుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్ట్ న్యాయమూర్తి రోజా రమణి తుది తీర్పు వెలువరించారు. 2019లో కట్టంగూరు PS పరిధిలో ఈ ఘటన జరగగా..  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో వాదనల అనంతరం, నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా కూడా విధించారు.

సంబంధిత పోస్ట్