నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

1902చూసినవారు
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం
వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం సమీపం వద్దా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై డీసీఎం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా వాహనదారునికి గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ను డీసీఎం వెనకనుంచి ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్