పాలెం వద్ద రోడ్డు ప్రమాదం: కారు ఢీకొని వ్యక్తి మృతి

2751చూసినవారు
నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలం పాలెం స్టేజి సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వజ్ర తేజ రైస్ మిల్ వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉన్న చింతపల్లి మండలం వెంకటంపేట గ్రామానికి చెందిన వి.రాములు (50) అనే వ్యక్తిని, హాలియా నుండి నల్గొండ వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన రాములు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్