నకిరేకల్ మండలం మార్రూరులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మన్నెం జశ్వంత్(15) అనే బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. జశ్వంత్ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి, నేడు విడుదల కానున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.