విషాదం.. బైక్ ఢీకొని బాలుడు మృతి

8చూసినవారు
విషాదం.. బైక్ ఢీకొని బాలుడు మృతి
రంగులు చల్లుకునేందుకు ద్విచక్రవాహనంపై వెళుతూ, దేవరకొండ పట్టణంలో మంగళవారం హోలీ పండగ సందర్భంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన కార్తికేయన్‌(16) అనే బాలుడు మృతి చెందగా, మరో బాలుడు శ్రీనివాస్‌చారి తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ కొండమల్లేపల్లిలో ఉంటున్న స్నేహితుని వద్దకు బైక్‌పై వెళ్తుండగా, మార్గమధ్యలో ఉప్పాగు సమీపంలో కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిలోని డివైడర్‌ను అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కార్తికేయన్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందగా, శ్రీనివాస్‌చారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో ఆ ఇళ్లల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తండ్రి ప్రస్తుతం ముంబైలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. మృతదేహాన్ని తమిళనాడుకు తరలిస్తామని స్నేహితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్