హైకోర్టులో గెలిచి నామినేషన్‌ వేసి..

1932చూసినవారు
హైకోర్టులో గెలిచి నామినేషన్‌ వేసి..
త్రిపురారం మండలం చౌళ్లతండాకు చెందిన ధరావత్‌ కల్పన, మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన చింతమళ్ల రాంప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. తన ఓటును మాడ్గులపల్లి మండలానికి బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆమె పేరు ఆన్‌లైన్ జాబితాలో ఉన్నా, ఓటర్ల జాబితాలో కనిపించలేదు. దీంతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడంలో అడ్డంకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించగా, మంగళవారం కల్పన పేరును తక్షణమే మాడ్గులపల్లి మండల ఓటరు జాబితాలో చేర్చాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కల్పన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

సంబంధిత పోస్ట్