నల్లగొండ నియోజకవర్గంలో వివిధ పదవులలో బీసీలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దపీట వేశారని నలగొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంత్రి ఎక్కడా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.