నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు భారీ వాహనాల రాకపోకలపై ఎస్పీ శరత్ చంద్ర ఆంక్షలు విధించారు. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలను అనుమతిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.