Mar 12, 2026, 01:03 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
నగదు లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ నరసింహ
Mar 12, 2026, 01:03 IST
జిల్లా ఎస్పీ నర్సింహ, మునగాల మండలం ఆకుపాముల లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సులో ప్రజలు నగదు లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేర రహిత సమాజ నిర్మాణం, మహిళా భద్రత, సైబర్ మోసాల నివారణపై ఆయన మాట్లాడారు. డిజిటల్ నగదు మార్పిడిపై అప్రమత్తతతో పాటు, సమాజానికి డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, సిఐలు రామ కృష్ణా రెడ్డి, శివ శంకర్ పాల్గొన్నారు.