సూర్యాపేట జిల్లా రామాపురం గ్రామానికి చెందిన షేక్ సైదా అనే గుండె రోగి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబం ఆర్థిక పరిస్థితిని గమనించిన ఎంపీపీ కొట్టే పద్మ సైదేశ్వర్ రావు, నాయకులు రంగిశెట్టి సైదయ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2.25 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఈ సాయం రోగి కుటుంబానికి ఎంతో ఉపశమనం కలిగించింది.