ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) పేదలకు ఒక వరంగా మారిందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహకారంతో 47వ వార్డుకు చెందిన మోహనంది సైదులుకు రూ. 31,000 ఆర్థిక సాయం చెక్కును ఆయన అందజేశారు. కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలవడంపై లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు.