నేరేడుచర్ల: పదవ తరగతి ఫలితాల్లో నేరేడుచర్ల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థిని ఎమ్. అనుష 561/600 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచి పాఠశాల కీర్తిని చాటింది. అలాగే ఎమ్. హర్షిత్ (560), సిహెచ్. లోకేష్ (555), బి. సాయి చరణ్ (551), మరియు వై. వెంకట్
చరణ్ (548) మార్కులతో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు మిఠాయిలు తినిపించి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేశారు.