జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిగా అనిత

483చూసినవారు
జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిగా అనిత
సూర్యాపేట జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారిగా అనిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన లక్ష్మణ్ నాయక్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ కావడంతో, జనగామ నుంచి అనిత ఇక్కడకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అందరి సహకారంతో జిల్లాలో అక్రమ మద్యం నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్