గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

0చూసినవారు
గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
2026–27 విద్యాసంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షతో పాటు 6 నుంచి 9 తరగతులలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం ఉందని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని ఆయన వెల్లడించారు. https: //tgcet. cgg. gov. in, https: //tgswreis. telangana. gov. in, https: //tgtwgurukulam. telangana. gov. in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేయాలని, కులం, ఆదాయం, ఆధార్, జనన ధృవీకరణ పత్రం, ఫోటో వివరాలు అవసరమని సూచించారు.

సంబంధిత పోస్ట్