మాదకద్రవ్యాల నిర్మూలన, పిల్లల భద్రత పై వారం పాటు అవగాహన

3చూసినవారు
మాదకద్రవ్యాల నిర్మూలన, పిల్లల భద్రత పై వారం పాటు అవగాహన
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన, పిల్లల భద్రతపై వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీసు శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో సోమవారం నుంచి గ్రామాల వారీగా ప్రచారం చేపడతారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై దుష్ప్రభావాల గురించి ప్రజలకు వివరిస్తారు. గంజాయి సరఫరా, వినియోగంపై నిఘా కొనసాగుతుందని, పాత కేసుల వారిపై పర్యవేక్షణతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు, యువత భాగస్వామ్యం కావాలని కోరారు.