సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అబ్బిరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ పరిధి సుభాష్
నగర్ లో 20 వ్యవసాయ మోటార్ల వద్ద కేబుల్ వైర్లను పలువురు దొంగలు కత్తిరించుకుపోయారు. మంగళ వారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించారు. సబ్ మెర్సిబుల్ మోటారు నుంచి మెయిన్ బోర్డు వరకు ఉండే కేబుల్ వైర్లు కట్చేసి ఉండటాన్ని గమనించి స్థానిక రైతులు ఆందోళన చెందారు. మొత్తం 20 మోటార్ల వరకు లెక్క తేలాయని బాధిత రైతులు గాదె మల్లారెడ్డి, జానపాటి శంకర్, నంద్యాల రాము, కుసుమ సైదిరెడ్డి, కాంతారెడ్డి తదితరులు చెప్పారు. ఒక్కో మోటారు వద్ద 40 మీటర్ల కేబుల్ వైరు కట్ చేశారని, మీటరు కేబుల్ వైరు రూ.150 చొప్పున ఉందని, ఈ లెక్కన 20 మోటార్ల వద్ద సుమారు రూ. 1లక్ష కేబుల్ వైర్లు కత్తిరించేశారని సదరు రైతులు చెప్పారు.