తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, పోలీసు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. శనివారం జరిగిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణ, బాధితులతో వ్యవహరించే తీరు, కేసుల దర్యాప్తు, ఉద్యోగ నిర్వహణలో పాటించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహా గస్తీ, ఫిర్యాదుల పరిష్కారం, 100 కాల్స్‌పై స్పందన, బాధితుల ఇంటి వద్దే కేసుల నమోదు వంటి అంశాలను వివరించారు.