జనగణన–2027 దేశాభివృద్ధికి కీలకం..కలెక్టర్

0చూసినవారు
జనగణన–2027 దేశాభివృద్ధికి కీలకం..కలెక్టర్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనగణన–2027 సర్వే దేశాభివృద్ధికి, భవిష్యత్తు సంక్షేమ పథకాల రూపకల్పనకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన జనగణన ప్రక్రియలో భాగంగా అధికారుల వివరాల నమోదు, వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా పూర్తి, ఖచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. ఈ సర్వే ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను రూపొందిస్తాయని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న సర్వే సిబ్బందిని ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్