దేశాభివృద్ధికి, భవిష్యత్తు కు జనాభా గణన కీలకం

1చూసినవారు
దేశాభివృద్ధికి, భవిష్యత్తు కు జనాభా గణన కీలకం
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ, జనగణన–2027 దేశాభివృద్ధికి, భవిష్యత్తు సంక్షేమ పథకాల రూపకల్పనకు అత్యంత కీలకమని తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జనగణన ప్రక్రియలో భాగంగా అధికారులు ఆయన వివరాలను నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా పూర్తి, ఖచ్చితమైన సమాచారం అందించాలని, జనగణన ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను రూపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.