బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శిగా చందా సైదబాబు

550చూసినవారు
బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శిగా చందా సైదబాబు
పెన్‌పహాడ్ మండలం తంగేళ్లగూడెం గ్రామానికి చెందిన చందా సైదబాబును బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శిగా నియమించారు. హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సైదబాబు మాట్లాడుతూ బీసీ యువజన సంఘాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూ యువతను చైతన్యపరిచేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన ఆర్. కృష్ణయ్య, డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, పగిళ్ల సతీష్, పచ్చిపాల రామకృష్ణ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేడం కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్