సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధ్యక్షతన పదవ తరగతి ఫలితాలపై సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా 98.6% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7వ స్థానం సాధించినందుకు విద్యాశాఖను కలెక్టర్ అభినందించారు. ఫలితాల సాధనలో భాగస్వాములైన ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. ప్రత్యేక తరగతులు, పర్యవేక్షణతో ఫలితాలు మెరుగయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాదికి మరింత కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు.