కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మోతె మండలం మాజీ జెడ్పిటిసి, సర్పంచులు జిల్లా ఎస్పీ నరసింహకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి భానోత్ మాతృనాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు ఉన్నప్పటికీ, సభ్యత మరిచి విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో నూకల మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.