కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని, వారసత్వ భూమి ఆక్రమణపై న్యాయం చేయడంలో జాప్యం చేస్తున్నారని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మల్లు భిక్ష్మా రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమంలో వారు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో కలెక్టర్ ఆదేశించినా ఆర్డీవో స్పందించడం లేదని, నెలలు గడుస్తున్నా ఫలితం లేదని, పైగా దుర్భాషలాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమిని ఇప్పించి న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు.