ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు: కాంగ్రెస్‌ నిరసన

0చూసినవారు
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు: కాంగ్రెస్‌ నిరసన
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌స్టాండ్‌ వద్ద డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది పాల్గొన్నారు. ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్