ధాన్యం కొనుగోలులో జాప్యం: బాలెంల ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ధర్నా

0చూసినవారు
ధాన్యం కొనుగోలులో జాప్యం: బాలెంల ఐకేపీ కేంద్రం వద్ద రైతుల ధర్నా
సూర్యాపేట మండలం బాలెంల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పోసి 30 నుంచి 40 రోజులు గడిచినా కొనుగోలు జరగట్లేదని రైతులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కొనుగోలు ప్రక్రియలో జాప్యంపై ఆందోళన వ్యక్తమైంది.

సంబంధిత పోస్ట్