సూర్యాపేట పట్టణంలోని 40వ వార్డు గొల్లబజార్‌లో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ హాస్టల్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, స్టోర్‌రూమ్, తాగునీరు, పారిశుధ్యం, ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన వసతులు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.