జిల్లాలో మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మున్సిపల్ కమీషనర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 7, 8, 9 తేదీలలో ఎన్నికల విధులు నిర్వహించేవారు ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ పొందిన వారికి సాధారణ ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు.