
కళ్లల్లో కారంకొట్టి కేజీ బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
AP: పల్నాడు జిల్లా కారంపూడిలో సినీ తరహాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తీసుకెళ్తున్న వ్యక్తిపై కళ్లల్లో కారం కొట్టి, దాడి చేసి, సుమారు కేజీ బంగారం అపహరించుకుపోయారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై, దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.




