తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు... ఉత్తమ్

1చూసినవారు
తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు... ఉత్తమ్
రాష్ట్రంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాగా, అందులో 57 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ. 10,096 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 17 జిల్లాల్లో 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినప్పటికీ, 95 శాతం ధాన్యాన్ని రాత్రికిరాత్రే మిల్లులకు తరలించామని చెప్పారు. లారీలు, కూలీలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచి కొనుగోళ్లు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్