దాన్యం కొనుగోలు పి ఏ సిఎస్ సెంటర్ నిర్వాహకులు ఇష్టానుసారం

311చూసినవారు
దాన్యం కొనుగోలు పి ఏ సిఎస్ సెంటర్ నిర్వాహకులు ఇష్టానుసారం
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నత్తనడకన సాగుతున్నాయని, రెండు కేంద్రాలు ఉన్నా ఫలితం శూన్యంగా మారిందని రైతులు ఆరోపించారు. మండల పరిధిలోని పిఎసిఎస్ సెంటర్లో నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ముడుపులు ఇస్తేనే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, ఈ కేంద్రాలపై పర్యవేక్షణ అధికారులు లేకపోవడంపై చర్చ జరుగుతోంది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వివిధ పిఎస్సీ సెంటర్లలో, ఐకెపి సెంటర్లలో తనిఖీలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్