సూర్యాపేటలో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు: పలు లోపాల గుర్తింపు

847చూసినవారు
సూర్యాపేటలో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు: పలు లోపాల గుర్తింపు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై శనివారం అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు 7 మిడ్‌వే ప్లాజా రాయగూడెం, లిటిల్ విలేజ్ బిర్యానీ, అన్నపూర్ణ మెస్ లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆహార తయారీ, నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం వంటి పలు లోపాలను గుర్తించారు. వంటగది, రిఫ్రిజిరేటర్లు కూడా సక్రమంగా శుభ్రపరచకపోవడంతో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్