
అప్పుడు అందుకే టీడీపీ తో పొత్తు: కేసీఆర్
2009లో చంద్రబాబుతో కలిసి 'జై తెలంగాణ' అనిపించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని, అశోక్ గులాటీ సలహా మేరకు రైతుబంధు పథకం తెచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, ధాన్యం కొనలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, తెలంగాణ ప్రజలు బొందల పడ్డట్టు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి వస్తుంటే, ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదని, ఇది చండాలమైన, చిల్లర ప్రభుత్వం అని కేసీఆర్ విమర్శించారు.




