గరిడేపల్లి మండల కేంద్రంలో ఫేక్ ఫోన్‌పే ద్వారా వ్యాపారులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముత్యాల గోపి కల్యాణ్ (25), సిద్ధాపురం కార్తీక్ (21) అనే నిందితులు, నకిలీ ఫోన్‌పే యాప్ ద్వారా రూ.25,000 విలువైన కిరాణా సరుకులు కొనుగోలు చేసి మోసం చేశారు. గత 10 రోజుల్లో వీరు రూ.2,06,747 విలువైన సరుకులను వివిధ ప్రాంతాల్లోని వ్యాపారుల నుంచి మోసపూరితంగా సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.1,26,000 నగదు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.