అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న - లింగయ్య గౌడ్

0చూసినవారు
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న - లింగయ్య గౌడ్
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలోని బండ మీది చందుపట్ల గ్రామంలో సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శిగ లింగయ్య గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 'అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న' అని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 36వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్