చిట్టీల పేరుతో కోట్లు మోసం..ప్రభుత్వ ఉపాధ్యాయుడు భార్య అరెస్ట్

0చూసినవారు
చిట్టీల పేరుతో కోట్లు మోసం..ప్రభుత్వ ఉపాధ్యాయుడు భార్య అరెస్ట్
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బానోత్ రాజు, అతని భార్య అనూష చిట్టీలు, డెయిలీ కలెక్షన్ల పేరుతో ప్రజల నుంచి రూ. 6.24 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. 2015 నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్న వీరిని చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు రూ. 3.18 కోట్లు చెల్లించగా, రూ. 3.05 కోట్లు బకాయిలు ఉన్నట్లు డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఇతర బాధితులు ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్